ఎయిర్‌టెల్‌ నుంచి డిజి గోల్డ్‌

ABN , First Publish Date - 2021-05-14T05:32:09+05:30 IST

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తమ కస్టమర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు సహాయకారిగా ఉండే డిజి గోల్డ్‌ డిజిటల్‌ వేదికను ప్రారంభించింది. ఇందుకోసం డిజిటల్‌...

ఎయిర్‌టెల్‌ నుంచి డిజి గోల్డ్‌

ముంబై : ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ తమ కస్టమర్లు బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు సహాయకారిగా ఉండే డిజి గోల్డ్‌ డిజిటల్‌ వేదికను ప్రారంభించింది. ఇందుకోసం డిజిటల్‌ గోల్డ్‌ రంగంలో సేవలందిస్తున్న సేఫ్‌ గోల్డ్‌ భాగస్వామ్యంలో దీన్ని ప్రారంభించింది. డిజి గోల్డ్‌ సహాయంతో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో పొదుపు ఖాతా ఉన్న కస్టమర్లు 24 క్యారట్ల బంగారంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలాగే ఎయిర్‌టెల్‌ పేమెం ట్స్‌ బ్యాంక్‌ ఖాతాలున్న తమ బంధుమిత్రులకు కూడా డిజిగోల్డ్‌ బహుమానంగా ఇవ్వొచ్చని బ్యాంకు సీఓఓ గణేశ్‌ అనంతనారాయణ్‌ తెలిపారు. తమ కస్టమర్లు కొనుగోలు చేసిన డిజిగోల్డ్‌ను సేఫ్‌గోల్డ్‌ సంస్థ ఎలాంటి అదనపు రుసుము లేకుండా భద్రపరుస్తుంది. బంగారంలో పెట్టుబడికి కనీస పరిమితి కూడా ఏదీ విధించకపోవడం విశేషం. 

Updated Date - 2021-05-14T05:32:09+05:30 IST