యూకే నుంచి యూఎస్‌... బ్రిటిష్‌ ఏయిర్‌ వేస్‌ విమానాల ప్రారంభం

ABN , First Publish Date - 2021-11-09T10:33:55+05:30 IST

యూకే నుంచి యూఎస్‌... బ్రిటిష్‌ ఏయిర్‌ వేస్‌ విమానాల ప్రారంభం

యూకే నుంచి యూఎస్‌... బ్రిటిష్‌ ఏయిర్‌ వేస్‌ విమానాల ప్రారంభం

లండన్ : కోవిడ్‌ నేపధ్యంలో దాదాపు ఇరవై నెలల కిందట స్తంభించిపోయిన పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. అయితే... మళ్ళీ కరోనా మహమ్మరి విరుచుకుపడవచ్చన్న సందేహాలెలా ఉన్నపన్పటికీ... కొన్ని వ్యవస్థలు మాత్రం తమ కార్యకలాపాలను పునప్రారంభిస్తున్నాయి. ఇదే క్రమంలో... అంతర్జాతీయ విమానయాన రాకపోకలపై విధించిన నిషేధాన్ని అమెరికా ప్రభుత్వం ఎత్తివేయడంతో... లండన్‌ నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్, వర్జిన్ అట్లాంటిక్ విమానాలు సోమవారం లండన్‌లోని హీత్రూ విమానా శ్రయం నుంచి న్యూయార్క్‌లోని జాన్‌ఎఫ్‌ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి ఈ ఫ్లైట్‌లు వెళ్ళాయి. కోవిడ్-19 నేపధ్యంలో పూర్తిగా టీకాలు వేసుకున్న విదేశీ సందర్శకులకు అమెరికా  తన వాయు సరిహద్దులను తిరిగి ప్రారంభించింది. సోమవారం ఉదయం హీత్రూ విమానాశ్రయం నుండి అమెరికాలోని న్యూయార్క్  జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జా తీయ విమానాశ్రయానికి రెండు విమానాలు ఒకే సమయంలో బయలుదేరాయి.


గతేడాది మార్చిలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్, బ్రిటన్, చైనా, ఇండియా బ్రెజిల్‌ సహా ఇతరత్రా పెద్ద నగరాల  నుండి వచ్చే మార్గాలను అమెరికా మూసివేసిన విషయం తెలిసిందే. మెక్సికో, కెనడా నుండి ఓవర్‌ల్యాండ్ సందర్శకులను కూడా నిషేధించారు. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని... ఇప్పుడు సడలించడంతో... నిషేధాన్ని ఎత్తివేసినట్లైంది. కాగా...  ప్రయాణికులు ‘కోవిడ్‌ -19 నెగిటివ్‌’ అని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2021-11-09T10:33:55+05:30 IST