ఐఆర్‌సీటీసీతో అభిబస్ ఒప్పందం
ABN , First Publish Date - 2021-02-26T09:49:06+05:30 IST
ఐఆర్‌సీటీసీతో అభిబస్ ఒప్పందం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్లాట్‌ఫామ్‌పై బస్ టికెట్లను విక్రయించడానికి ఐఆర్‌సీటీసీతో అభిబస్ డాట్‌కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఐఆర్‌సీటీసీ ఖాతాదారులు లక్ష బస్సు మార్గాల్లో స్లీపర్/నాన్ స్లీపర్, ఏసీ/నాన్ ఏసీ బస్సుల టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే టికెట్లు లేకపోతే (వెయిటింగ్ లిస్ట్) వెంటనే బస్సు లభ్యతను వినియోగదారులు చూసుకుని టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు.