ఈక్విటీ షేర్ల సబ్-డివిజన్‌కు... అఫ్లే ఇండియా గ్రీన్ సిగ్నల్...

ABN , First Publish Date - 2021-08-27T19:32:06+05:30 IST

వాటాదారులకు అఫ్లే ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. స్టాక్ స్ప్లిట్(ఈక్విటీ షేర్ల సబ్-డివిజన్)ను 1: 5 నిష్పత్తిలో ఆమోదించింది. వాటాదారులు, ఇతర అవసరమైన ఆమోదాలకు లోబడి స్టాక్ విభజన ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఈక్విటీ షేర్ల సబ్-డివిజన్‌కు... అఫ్లే ఇండియా గ్రీన్ సిగ్నల్...

హైదరాబాద్ : వాటాదారులకు అఫ్లే ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. స్టాక్ స్ప్లిట్(ఈక్విటీ షేర్ల సబ్-డివిజన్)ను 1: 5 నిష్పత్తిలో ఆమోదించింది. వాటాదారులు, ఇతర అవసరమైన ఆమోదాలకు లోబడి స్టాక్ విభజన ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కొక్క ఈక్విటీ షేర్‌ను ఐదుగా విభజించి షేర్ ముఖ విలువను రూ. 2 గా విభజించినట్టు కంపెనీ వెల్లడించింది. స్టాక్ విభజన కోసం వాటాదారుల ఆమోదం తరువాత.. దీనికి రికార్డ్ తేదీ అక్టోబరు  8, 2021 అని అఫ్లే ఇండియా వెల్లడించింది. 

Updated Date - 2021-08-27T19:32:06+05:30 IST