తెలంగాణలో 400 స్టార్ట్‌పలు
ABN , First Publish Date - 2021-11-28T08:09:51+05:30 IST
స్టార్ట్‌పలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రం లో దాదాపు 400 స్టార్ట్‌పలు పని చేస్తున్నాయని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): స్టార్ట్‌పలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రం లో దాదాపు 400 స్టార్ట్‌పలు పని చేస్తున్నాయని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ అన్నారు. ప్రభుత్వం స్టార్ట్‌పల సేవలను వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోందని.. అదే విధంగా కంపెనీలు కూడా స్టార్ట్‌పల సేవలను వినియోగించుకోవడానికి పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. స్టార్టప్ వ్యవస్థ సమంగా విస్తరించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఔత్సాహిక పారిశ్రామికలను ప్రోత్సహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.