గూగుల్‌కు 36 మంది కీలకాధికారులు గుడ్‌బై!

ABN , First Publish Date - 2021-06-23T04:50:10+05:30 IST

గతేడాది నుంచీ ఇప్పటివరకూ ఏకంగా 36 మంది వైస్ ప్రెసిడెంట్లు గూగుల్‌ను విడిచి వెళ్లిపోయారని న్యూయార్క్ టైమ్స్ తాజాగా ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.

గూగుల్‌కు 36 మంది కీలకాధికారులు గుడ్‌బై!

వాషింగ్టన్: గతేడాది నుంచీ ఇప్పటివరకూ ఏకంగా 36 మంది వైస్ ప్రెసిడెంట్లు గూగుల్‌ను విడిచి వెళ్లిపోయారని న్యూయార్క్ టైమ్స్ తాజాగా ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. రిస్క్ తీసుకోకూడదన్న కంపెనీ విధానంతో అనేక మంది ఉద్యోగులు విభేదిస్తున్నట్టు తన కథనంలో పేర్కొంది. మరోవైపు.. గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అపర్ణా చెన్నాప్రగడతో పాటూ పలువురు ఉన్నతాధికారులు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్‌పై ప్రసంశల వర్షం కురిపించారు. ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యవక్తమవుతున్నా గానీ సుందర్ పిచాయ్ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెరవలేదని వారు వ్యాఖ్యానించారట. గూగుల్ సినియర్ అధికారుల్లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా సుందర్ పిచాయ్ కొత్త సవాలు ఎదుర్కొంటున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. 

Updated Date - 2021-06-23T04:50:10+05:30 IST