మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-12-25T07:53:09+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, విద్యుత్‌ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా వారాంతం (శుక్రవారం) ట్రేడింగ్‌లో ప్రామాణిక ఈక్వి టీ సూచీలు...

మూడు రోజుల లాభాలకు బ్రేక్‌

  • వారాంతంలో సెన్సెక్స్‌ 191 పాయింట్లు డౌన్‌ 

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్ట పడింది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, విద్యుత్‌ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా వారాంతం (శుక్రవారం) ట్రేడింగ్‌లో ప్రామాణిక ఈక్వి టీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 190.97 పాయింట్లు కోల్పోయి 57,124.31 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 68.85 పాయింట్ల నష్టంతో 17,003.75 వద్ద ముగిసింది. 


ఇన్ఫీ @ రూ.8 లక్షల కోట్లు : దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌ మరో రికార్డును నమోదు చేసుకుంది. శుక్రవారం బీఎ్‌సఈ ప్రారంభ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర సరికొత్త ఏడాది గరిష్ఠ స్థాయి రూ.1,913 కు ఎగబాకింది. దాంతో ఇన్ఫోసిస్‌ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తొలిసారిగా రూ.8 లక్షల కోట్ల మైలురాయికి చేరుకుంది. 


డేటా ప్యాటర్న్స్‌ లిస్టింగ్‌ లాభం 29శాతం : రక్షణ, అంతరిక్ష రంగాలకు ఎలకా్ట్రనిక్స్‌ సిస్టమ్స్‌ను సరఫరా చేసే డేటా ప్యాటర్న్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో షేర్లను నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.585తో పోలిస్తే, కంపెనీ షేరు బీఎస్‌ఈలో 48 శాతం ప్రీమియంతో రూ.864 వద్ద లిస్ట్‌ అయుంది. తొలి రోజు ట్రేడింగ్‌ ముగిసే సరికి కంపెనీ షేరు 29.03 శాతం లాభంతో రూ.754.85 వద్ద స్థిరపడింది. 


Updated Date - 2021-12-25T07:53:09+05:30 IST