కర్నూల్‌లో రూ.250 కోట్లతో ఎలెన్‌బరీ ప్లాంట్‌

ABN , First Publish Date - 2021-08-10T09:15:43+05:30 IST

పారిశ్రామిక, మెడికల్‌ గ్యాస్‌లను ఉత్పత్తి చేస్తున్న ఎలెన్‌బరీ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో రూ.250 కోట్లతో రోజుకు 600 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

కర్నూల్‌లో రూ.250 కోట్లతో ఎలెన్‌బరీ ప్లాంట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పారిశ్రామిక, మెడికల్‌ గ్యాస్‌లను ఉత్పత్తి చేస్తున్న ఎలెన్‌బరీ ఇండస్ట్రియల్‌ గ్యాసెస్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లో రూ.250 కోట్లతో రోజుకు 600 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2022 ద్వితీయార్ధం నాటికి ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని  కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ అగర్వాల్‌ తెలిపారు. అంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లోని ఖాతాదారుల నుంచి పెరుగుతున్న గిరాకీని ఈ ప్లాంట్‌ తీరుస్తుందని చెప్పారు. జపాన్‌కు చెందిన ఇండస్ట్రీయల్‌ గ్యాసెస్‌ కంపెనీ ఎయిర్‌ వాటర్‌ ఇంక్‌ నుంచి కంపెనీకి చెందిన 51 శాతం వాటాను ప్రమోటర్లు వెనక్కి కొనుగోలు చేశారు. 2013లో అగర్వాల్‌ కుటుంబం కంపెనీలో ఈ వాటాను ఎయిర్‌ వాటర్‌కు విక్రయించింది. కంపెనీకి పశ్చిమ బెంగాల్‌లో నాలుగు చోట్ల, హైదరాబాద్‌, విశాఖపట్నంలో ప్లాంట్లు ఉన్నాయి. 

Updated Date - 2021-08-10T09:15:43+05:30 IST