10 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం
ABN , First Publish Date - 2021-08-25T06:48:39+05:30 IST
హ్యుండయ్ మోటార్ ఇండియా అత్యంత ఆకర్షణీయమైన హంగులతో ఐ20 ఎన్ లైన్ మోడల్‌ను ఆవిష్కరించింది. స్పోర్టీ వాహనాల పట్ల అమిత ఆకర్షణ గల కస్టమర్ల కోసం మరింత మెరుగైన సామర్థ్యాలతో కూడిన ఎన్ లైన్ మోడల్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయడం ఇదే ప్రథమం

ఐ20 ఎన్ లైన్ ఆవిష్కరించిన హ్యుండయ్
న్యూఢిల్లీ: హ్యుండయ్ మోటార్ ఇండియా అత్యంత ఆకర్షణీయమైన హంగులతో ఐ20 ఎన్ లైన్ మోడల్‌ను ఆవిష్కరించింది. స్పోర్టీ వాహనాల పట్ల అమిత ఆకర్షణ గల కస్టమర్ల కోసం మరింత మెరుగైన సామర్థ్యాలతో కూడిన ఎన్ లైన్ మోడల్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయడం ఇదే ప్రథమం. ఇందులో 6 ఐఎంటీ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ కారు 120 పీఎస్ పవర్‌తో కేవలం 10 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. ఏదైనా విభిన్నంగా చేయాలనే ఆలోచన ఉండే మిలీనియల్స్ కోసం ఈ ఎన్ లైన్ కార్లను తయారుచేసినట్టు కంపెనీ సీఈఓ ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ శ్రేణిలో మరిన్ని మోడళ్లను తీసుకొస్తామని ఆయన చెప్పారు. ఈ కార్ల బుకింగ్ సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు మొదటి వారంలో ధర ప్రకటించనుంది.