బ్రేకింగ్ : విశాఖ కార్పొరేషన్‌ వైసీపీ కైవసం

ABN , First Publish Date - 2021-03-14T21:11:40+05:30 IST

విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది....

బ్రేకింగ్ : విశాఖ కార్పొరేషన్‌ వైసీపీ కైవసం

విశాఖపట్నం : విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 55 డివిజన్లలో వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ- 29, జనసేన-04, ఇతరులు-06 స్థానాల్లో గెలుపొందారు. కాగా.. మొదట్నుంచి విజయవాడ, విశాఖపట్నంలో వైసీపీ జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్‌తో వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తూ వెళ్లింది. ఇవాళ ఎన్నికల ఫలితాలు మొదలైన నాటి నుంచి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠే నెలకొంది. అయితే 12 గంటల తర్వాత సీన్ మారిపోయింది. కచ్చితంగా గెలిచి తీరుతామని టీడీపీ.. సార్వత్రిక ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా జెండా ఎగరేసి తీరుతామని వైసీపీ ధీమాతో ఉంది. ఆఖరికి విశాఖ కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకోవడంతో అన్నుకున్నది సాధించామని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.


కాగా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా వైసీపీ హవా నడిచింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. 11 కార్పొరేషన్లలో 8 కార్పొరేషన్లను వైసీపీనే సొంతం చేసుకుందని తెలుస్తోంది. మరోవైపు 75 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 69 వైసీపీ కైవసం చేసుకుందని సమాచారం. టీడీపీ మాత్రం రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే గెలిచింది. ఇంకా కొన్ని చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది.

Updated Date - 2021-03-14T21:11:40+05:30 IST