వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-08T14:55:51+05:30 IST

వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌కు మంత్రి అవంతి, వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా

వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు

విశాఖ: వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌కు మంత్రి అవంతి, వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. పేదల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారన్నారు. దేశంలో సంక్షేమ విప్లవం తెచ్చిన మహా నేత రాజశేఖర్‌రెడ్డి అని మంత్రి అవంతి కొనియాడారు.

Updated Date - 2021-07-08T14:55:51+05:30 IST