సుబ్బరాయుడు అనే వ్యక్తిపై వివేకా కుమార్తె ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-07-13T02:05:49+05:30 IST

కొద్ది రోజుల క్రితం వివేకా హత్య కేసులో కుమార్తె సునీతను కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. తనను హత్యా కేసులో కావాలనే ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ పులివెందుల డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వివేకా కుమార్తె సునీత పర్కొన్నారు.

సుబ్బరాయుడు అనే వ్యక్తిపై వివేకా కుమార్తె ఫిర్యాదు

కడప: తనపై విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి లేఖ రాసిన సుబ్బరాయుడు అనే వ్యక్తిపై మాజీ మంత్రి, ఏపీ సీఎం వైఎస్‌ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపకు చెందిన ఈయన కొద్ది రోజుల క్రితం వివేకా హత్య కేసులో కుమార్తె సునీతను కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. తనను హత్యా కేసులో కావాలనే ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ పులివెందుల డీఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వివేకా కుమార్తె సునీత పర్కొన్నారు.

Updated Date - 2021-07-13T02:05:49+05:30 IST