రోశయ్య అంటే జగన్‌కు ఎందుకంత కోపం..?

ABN , First Publish Date - 2021-12-07T20:43:59+05:30 IST

జగన్ మనస్తత్వంపై, పోకడలపై వైఎస్సార్ సయితం తలపట్టుకునేవారని పలుమార్లు రోశయ్య వ్యాఖ్యానించారు.

రోశయ్య అంటే జగన్‌కు ఎందుకంత కోపం..?

హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఊహించని పరిణామాల్లో తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు వచ్చాయని రోశయ్య గతంలో ఇచ్చిన ఓపెన్ హార్ట విత్ ఆర్కే ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ పదవి కోసం తాను ఎవరితోనూ మాట్లాడలేదని, పైరవీ చేయలేదని చెప్పారు. ఎవరికీ ఊహకు అందని పరిస్థితిలో తనకు సీఎం పదవి వచ్చిందని రోశయ్య స్పష్టం చేశారు. తర్వాత కాలంలో జగన్ మనస్తత్వంపై, పోకడలపై వైఎస్సార్ కూడా తలపట్టుకునేవారని పలుమార్లు రోశయ్య వ్యాఖ్యానించారు. ఇవన్నీ జగన్ మనసులో పెట్టుకున్నారుకనుకే.. ఇప్పుడు రోశయ్య మృతిపై సంతాపం తెలిపేందుకు కూడా ఇష్టపడలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోశయ్య మృతిపై పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ స్పందించినా జగన్ మాత్రం అంటీ అంటనట్టుగా ఉన్నారు.

Updated Date - 2021-12-07T20:43:59+05:30 IST