ఎమ్మెల్యే కాసు గురజాలను మాఫియా రాజ్యంగా మార్చాడు: యరపతినేని

ABN , First Publish Date - 2021-08-11T02:24:08+05:30 IST

ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి గురజాలను మాఫియా రాజ్యంగా మార్చాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

ఎమ్మెల్యే కాసు గురజాలను మాఫియా రాజ్యంగా మార్చాడు: యరపతినేని

గుంటూరు: ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి గురజాలను మాఫియా రాజ్యంగా మార్చాడని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గురజాలలో అక్రమ మద్యం వ్యాపారం అంతా ఎమ్మెల్యే కాసు ఆధ్వర్యంలోనే నడుస్తుందని చెప్పారు. ఏం పాపం చేశాడని మైనార్టీ యువకుడు అలీషాను ఎక్సైజ్ పోలీసులు కొట్టి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం యువకుడిని కొట్టి చంపిన సీఐని ఎమ్మెల్యే కాసు వెనకేసుకొస్తున్నాడన్నారు, కాసు గురజాల ఎమ్మెల్యే అయ్యాక ఏడుగురిని హతమార్చారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. 

Updated Date - 2021-08-11T02:24:08+05:30 IST