నర్సీపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న వైసీపీ

ABN , First Publish Date - 2021-03-14T20:05:02+05:30 IST

నర్సీపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న వైసీపీ

నర్సీపట్నం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న వైసీపీ

విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని నర్సీపట్నం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. 28 వార్డులకు గాను వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించింది. టీడీపీ 12, జనసేన 1, ఇండిపెండెంట్ 1 వార్డులో గెలుపొందింది. మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ దూసుకెళ్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతుంది.


అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు దిమ్మతిరిగేలా అయింది. ఇప్పటివరకు 8 కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు, గుంటూరు కార్పొరేషన్లలో విజయం సాధించింది. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ వైసీపీ దూసుకెళ్తోంది.

Updated Date - 2021-03-14T20:05:02+05:30 IST