టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది: లేళ్ల అప్పిరెడ్డి
ABN , First Publish Date - 2021-02-01T22:20:16+05:30 IST
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు

విజయవాడ: టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నీచ, దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చిత్తూరు, శ్రీకాకుళంలో వాహనాలతో వైసీపీ వాళ్ళను తొక్కించారని, ఫోన్‌లలో బెదిరించారన్నారు. జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల సమయంలో తీవ్ర అన్యాయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గ్రామ పంచాయతీల్లో ఎక్కడా పార్టీల ప్రమేయం ఉండకూడదు అని సీఎం ఆకాంక్షించారని చెప్పారు. ఎస్‌ఈసీ.. డీజీపీ పనితీరును మెచ్చుకుంటుంటే.. టీడీపీ మాత్రం పోలీస్‌ల మనోస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడుతోందని ఆరోపించారు.