అశోక్‌ గజపతిరాజుపై MP Vijayasai తీవ్ర వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2021-09-03T18:15:49+05:30 IST

టీడీపీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింహాచలం ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన

అశోక్‌ గజపతిరాజుపై MP Vijayasai తీవ్ర వ్యాఖ్యలు...

విశాఖ: టీడీపీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజుపై.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింహాచలం ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. శుక్రవారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్మకర్తలు ధర్మానికి కట్టుబడి సంప్రదాయాలు కొనసాగించాలన్నారు. సింహాచలం ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయన్న మాట వాస్తవం అని మరోసారి విజయసాయి చెప్పుకొచ్చారు. 800 ఎకరాలకు పైగా పరాధీనం అయితే ధర్మకర్తలు ఏం చేస్తున్నారు..? అని ఆయన ప్రశ్నించారు. రూ.8వేల కోట్ల విలువైన ఆస్తి.. పరాధీనం పాలైతే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అశోక్‌పై ప్రశ్నల వర్షం..!?

అశోక్‌గజపతిరాజు బయటకు నీతులు.. లోపల కుట్రలుంటాయని విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ అశోక్‌ గజపతిరాజు ధర్మకర్తనా.. లేక అధర్మకర్తా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అక్రమాలు జరిగాయన్న దానిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని విజయసాయి రెడ్డి ఒకింత సవాల్ విసిరారు. తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. స్వార్థపూరితంగా మాన్సాస్ నిర్వహిస్తున్న వ్యక్తి అశోక్‌గజపతి అని విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆది నుంచీ విజయసాయి-అశోక్ గజపతి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. అయితే సంచయితను పదవి నుంచి తొలగించిన తర్వాత ఈ మాటల యుద్ధం మరింత ముదిరింది.

Updated Date - 2021-09-03T18:15:49+05:30 IST