ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-27T01:25:04+05:30 IST

ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైసీపీ ఎంపీ

ఏపీపై కేంద్రం సవతి ప్రేమ: విజయసాయిరెడ్డి

అమరావతి: ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ ఎంపీలతో సీఎం జగన్ సమావేశం  అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.  అనంతరం విజయసాయి మాట్లాడుతూ పార్లమెంట్‌లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీవద్దని సీఎం చెప్పారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఎంపీలంతా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఒత్తిడితో రూ.6,112 కోట్ల విద్యుత్‌ను తెలంగాణకు అమ్మినా ఏపీకి చెల్లింపు లేదని, ఆ బాధ్యత కేంద్రానిదేనన్నారు.


కాగ్ నివేదిక ప్రకారం రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ రూ.22,940 కోట్లయితే రూ.4,117 కోట్లు మాత్రమే ఇప్పటివరకూ కేంద్రం ఇచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులన్నీ ఇస్తే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయొచ్చన్నారు. బీజేపీ నేతలు భిక్షాటన చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాము అడిగిన పెండింగ్ నిధులే ఇవ్వడం లేదని ఇంకా రాజధానికి ఏమి ఇస్తారని విజయసాయి ఎద్దేవా చేశారు. 




Updated Date - 2021-11-27T01:25:04+05:30 IST