ఏకగ్రీవాలు పెరుగుతాయి తప్ప తగ్గవు: మిథున్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-02-06T01:30:26+05:30 IST

ఇంకా 10 సార్లు ఎన్నికలు జరిగినా ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు

ఏకగ్రీవాలు పెరుగుతాయి తప్ప తగ్గవు: మిథున్‌రెడ్డి

చిత్తూరు: ఇంకా 10 సార్లు ఎన్నికలు జరిగినా ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో చైతన్యం ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది.. చంద్రబాబు ఏం చేస్తారన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చిత్తూరు జిల్లాలోనే ఎక్కువగా పర్యటించారన్నారు. అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.. అయినా సరే ప్రజల్లో చైతన్యంతో ఇవాళ జరుగుతున్నది ఏమిటో అందరికీ తెలిసిందేనని చెప్పారు. మొదటి విడతలోనే ఇన్ని ఏకగ్రీవాలు జరిగాయంటే మిగతా విడతల్లోనూ సంఖ్య మరింతగా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా నిమ్మగడ్డ, చంద్రబాబులో మార్పు వస్తే మంచిదని సూచించారు.

Updated Date - 2021-02-06T01:30:26+05:30 IST