సొంత పార్టీ నేతలు, ఎంపీలపై ఎంపీ లావు కృష్ణదేవరాయ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-12-07T19:33:30+05:30 IST

వైసీపీలో లుకలుకలు నెలకొన్నాయి. సొంత పార్టీ నేతలు, ఎంపీలపై ఎంపీ లావు కృష్ణదేవరాయ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సొంత పార్టీ నేతలు, ఎంపీలపై ఎంపీ లావు కృష్ణదేవరాయ ఆగ్రహం

అమరావతి: వైసీపీలో లుకలుకలు నెలకొన్నాయి. సొంత పార్టీ నేతలు, ఎంపీలపై ఎంపీ లావు కృష్ణదేవరాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేటలో మంత్రుల పర్యటనకు తనకు ఆహ్వానం లేకపోవడంపై అధిష్టానానికి ఎంపీ లావు కృష్ణదేవరాయ ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట మార్కెట్ యార్డు పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి  మంత్రులు బాలినేని, రంగనాథరాజు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కృష్ణదేవరాయను సొంతపార్టీ నేతలు, మంత్రులు పట్టించుకోని పరిస్థితి. దీనిపై ఎంపీ కృష్ణదేవరాయ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. Updated Date - 2021-12-07T19:33:30+05:30 IST