జగనన్న ఇళ్లు చిన్న కుటుంబాలకి కూడా సరిపోవు: ప్రసన్నకుమార్ రెడ్డి

ABN , First Publish Date - 2021-06-26T22:15:37+05:30 IST

జగనన్న ఇళ్లు చిన్న కుటుంబాలకి కూడా సరిపోవు: ప్రసన్నకుమార్ రెడ్డి

జగనన్న ఇళ్లు చిన్న కుటుంబాలకి కూడా సరిపోవు: ప్రసన్నకుమార్ రెడ్డి

నెల్లూరు: కలెక్టరేట్‌లో జగనన్న ఇళ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు రంగనాథరాజు, బాలినేని, మేకపాటి, అనిల్‌కుమార్తో పాటు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగనన్న ఇళ్లు చిన్న కుటుంబాలకి కూడా సరిపోవన్నారు. అర్బన్‌లో అయితే మరీ ఘోరంగా 6 అంకణాలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాటిల్లో అయితే పంచలో శోభనం చేసుకుని బెడ్ రూంలో పడుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఇళ్ల విస్తీర్ణం పెంచాలని, ఇళ్లు ప్రభుత్వమే నిర్మించాలని ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-26T22:15:37+05:30 IST