నిమ్మగడ్డపై వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

ABN , First Publish Date - 2021-02-06T04:12:41+05:30 IST

నిమ్మగడ్డపై వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

నిమ్మగడ్డపై వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్

చిత్తూరు: పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఎక్కువ ఏకగ్రీవాలు అయితే వాటిపై అక్కసు వెళ్లగక్కడం మంచిది కాదని నిమ్మగడ్డకు ఎమ్మెల్యే సూచించారు.


చంద్రబాబు మాట వింటున్న నిమ్మగడ్డ ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచిది కాదని, తామెక్కడా దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకోలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రజలు ఏకగ్రీవానికి సిద్ధమయ్యారని ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు.

Updated Date - 2021-02-06T04:12:41+05:30 IST