శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల అరాచకం

ABN , First Publish Date - 2021-12-26T18:36:24+05:30 IST

పాతపట్నంలో వైసీపీ నేతల అరాచకం సృష్టించారు. అక్రమంగా గ్రావెల్‌ను తవ్వి వైసీపీ నేతలు తీసుకెళ్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతల అరాచకం

శ్రీకాకుళం: జిల్లాలోని పాతపట్నంలో వైసీపీ నేతలు అరాచకం సృష్టించారు. అక్రమంగా గ్రావెల్‌ను తవ్వి వైసీపీ నేతలు తీసుకెళ్తున్నారు. ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. గ్రావెల్‌ మాఫియా చర్యలను మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ త్రవ్వకాలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్రావెల్‌ తవ్వకాలతో స్థానికులు అవస్థలు పడుతున్నారని,  పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ మాఫియాకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. 

Updated Date - 2021-12-26T18:36:24+05:30 IST