వైసీపీ నేతలు వేధింపులు... వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా

ABN , First Publish Date - 2021-09-03T20:26:45+05:30 IST

ఏపీ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా కలకలం రేపుతోంది. ఇటీవల విశాఖ ఏజెన్సీలో 32 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం

వైసీపీ నేతలు వేధింపులు... వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా

చిత్తూరు: ఏపీ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా కలకలం రేపుతోంది. ఇటీవల విశాఖ ఏజెన్సీలో 32 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఏకంగా 74 మంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసి కలకలం రేపారు. చిత్తూరు జిల్లా పాకాల మండలంలో ఈవో, వైసీపీ నేతలు వేధిస్తున్నారంటూ 74 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అధికార పార్టీ నేతల వేధింపులకు నిరసనగా పాకాల ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈవో కుసుమకుమారిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ నేతల వేధింపులు ఆపాలని, నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు.


ఇటీవల విశాఖ మన్యంలో 32 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. మారుమూప్రాంతాల్లో గిరిజన గ్రామాలకు రోడ్లు, రవాణా సదుపాయాలు లేకున్నా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో పోలీసులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. గత్యంతరం లేక రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు.

Updated Date - 2021-09-03T20:26:45+05:30 IST