సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నేత దాడి

ABN , First Publish Date - 2021-11-24T02:38:19+05:30 IST

ఎంపీడీవో కళ్లెదుటే సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నేత

సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నేత దాడి

చిత్తూరు: ఎంపీడీవో కళ్లెదుటే సచివాలయ ఉద్యోగిపై వైసీపీ నేత దాడి చేశాడు. పెనుమూరు మండలం చార్వాగానపల్లి  సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్  సుబ్బరాజును ఓ వైసీపీ నాయకుడు ఎంపీడీవో కళ్లెదుటే  చెంప పగలగొట్టాడు. కావూరి వారి పల్లి పంచాయతీ సమస్యను వలంటర్ పరిష్కరించలేదని వెల్ఫేర్ అసిస్టెంట్‌ని సర్పంచ్‌తో కలసి గ్రామ సచివాలయానికి వచ్చిన వైసీపీ నాయకుడు ప్రశ్నించాడు. గ్రామ వలంటీర్లు చేయాల్సిన పనులను తనను ఎందుకు అడుగుతున్నావన్న వెల్ఫేర్ అసిస్టెంట్ నిలదీశాడు. ఎంపీడీవో గ్రామ సచివాలయానికి వచ్చి తనిఖీ చేస్తున్న సందర్భంగా ఆతని ఎదుటే వెల్ఫేర్ అసిస్టెంట్‌  చెంపలపై వైసీపీ నాయకులు కొట్టారు. చేసేది ఏమీ లేక ఎంపీడీవో గ్రామ సచివాలయం నుంచి సైలెంట్‌గా వెనుదిరిగారు.


గతంలో వైసీపీ నాయకులు అర్హత లేకున్నా కొన్ని ప్రభుత్వ పథకాలు ఇప్పించాలని వత్తిడి చేశారు. అయితే ఆ పనులు చేయకపోవడంతో అతనిపై కక్షతోనే కొట్టారని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోగా, వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నరాు. కేసులు పెడితే ఉద్యోగం నుంచి తీసి చేశామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం.Updated Date - 2021-11-24T02:38:19+05:30 IST