తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని ఓడించండి: యనమల
ABN , First Publish Date - 2021-03-22T01:51:17+05:30 IST
తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని ఓడించాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. వెంకటగిరిలో టీడీపీ

నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీని ఓడించాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. వెంకటగిరిలో టీడీపీ ఉప ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ వైసీపీ అరాచకాలతో స్థానిక ఎన్నికల్లో గెలవలేకపోయామని తెలిపారు. సీఎం జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. జగన్ జైల్లో ఉండి అలవాటుగా అందరూ జైల్లో ఉండాలనుకుంటున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినవి ఏవీ జగన్ అడగడం లేదని, సీఎం కేసీఆర్ ఏం చెబితే జగన్ అదే చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతిలో టీడీపీని గెలిపించి వైసీపీ రాక్షసపాలనకు బుద్ధి చెప్పాలని యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు.