నామినేషన్‌ కేంద్రాల్లో వైసీపీ హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-02-01T09:17:06+05:30 IST

శ్రీకాకు ళం జిల్లా సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడిపేట సర్పంచ్‌ స్థానానికి టీడీపీ మద్దతుదారు శిల్లా గౌతమి నామినేషన్‌ వేసేందుకు రాగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు.

నామినేషన్‌ కేంద్రాల్లో వైసీపీ హల్‌చల్‌

శ్రీకాకుళం, జనవరి 31(ఆంరధజ్యోతి): శ్రీకాకు ళం జిల్లా సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడిపేట సర్పంచ్‌ స్థానానికి టీడీపీ మద్దతుదారు శిల్లా గౌతమి నామినేషన్‌ వేసేందుకు రాగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. కుల, ఆదాయ, ఇతర పత్రాలను తీసుకెళ్లిపోయారని టీడీపీ నేత లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులతో విశాఖ డీఐజీ రంగారావు ఫోన్‌లో మాట్లాడారు. దగ్గరుం డి నామినేషన్‌ వేయించాలని పోలీసులను ఆదేశించారు. అధికారుల సహకారంతో ఆమె నామినేషన్‌ వేశారు. పాతపట్నం మండలం రొమదళ పంచాయతీ సర్పంచ్‌ స్థానం కోసం టీడీపీ మద్దతుదారు నవీన్‌కిరణ్‌ నామినేషన్‌ వేసేందుకు ఆర్‌..ఎల్‌.పురం కేంద్రానికి వచ్చారు. వైసీపీ నేతలు మిరియాబిల్లి శ్యాంసుందరరావు, సర్పంచ్‌ అభ్యర్థి అప్పలనాయుడు అడ్డుకొన్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఫిర్యాదు చేశా రు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో వైసీపీ మద్దతుదారుడు కింజరాపు అప్పన్న నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్‌ నామినేషన్‌ వేయించారు. 

Updated Date - 2021-02-01T09:17:06+05:30 IST