వైసీపీ వేధింపులు.. వీఆర్వో రాజీనామా!

ABN , First Publish Date - 2021-12-30T07:59:02+05:30 IST

వైసీపీ రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఓ వీఆర్వో ఉద్యోగానికి రాజీనామా చేసిన సంఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటుచేసుకుంది.

వైసీపీ వేధింపులు.. వీఆర్వో రాజీనామా!

అవనిగడ్డ టౌన్‌, డిసెంబరు 29: వైసీపీ రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఓ వీఆర్వో ఉద్యోగానికి రాజీనామా చేసిన సంఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటుచేసుకుంది. గుడివాడ శేషుబాబు చానాళ్లుగా అవనిగడ్డ వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అవనిగడ్డ మండలం వేకనూరు పంచాయతీని జనసేన పార్టీ కైవసం చేసుకుంది. దీనిలో శేషుబాబుకు పాత్ర ఉందన్న అనుమానంతో స్థానిక వైసీపీ పెద్దలు ఆయనను నియోజకవర్గానికి దూరం పెట్టేందుకు మచిలీపట్నం కలెక్టరేట్‌కు డిప్యుటేషన్‌ వేయించారు. అయితే తన తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నారని వీఆర్వో ఉన్నతాధికారులను, స్థానిక నేతలను ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం శేషుబాబు తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. ఇటీవల వీఆర్వోను మళ్లీ తిరువూరుకు బదిలీ చేశారు. దీంతో విసుగు చెందిన శేషుబాబు 20 రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరారు.

Updated Date - 2021-12-30T07:59:02+05:30 IST