చంద్రబాబుపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-02-06T00:06:54+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్

చంద్రబాబుపై ఎస్‌ఈసీకి వైసీపీ ఫిర్యాదు

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను వైసీపీ నేత లేళ్ల  అప్పిరెడ్డి కలిసి ఫిర్యాదు లేఖ అందించారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడారు.. చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినందున చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని కోరినట్లు తెలిపారు. కానీ ఎస్ఈసీ మాత్రం మేనిఫెస్టోను మాత్రమే రద్దు చేశారన్నారు. ఎన్నికల నియమావళిని చంద్రబాబు ఉల్లంఘించారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చామన్నారు. మేనిఫెస్టో రద్దు చేసి కేవలం తూతూ మంత్రంగా ఎస్ఈసీ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్ఈసీని కోరినట్లు పేర్కొన్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను నిలిపివేయాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు  కళ్లల్లో ఆనందం చూసేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2021-02-06T00:06:54+05:30 IST