రైతుల యాత్రను రాక్షసుల్లా అడ్డుకుంటున్న వైసీపీ: కళా

ABN , First Publish Date - 2021-12-08T08:03:16+05:30 IST

రైతుల యాత్రను రాక్షసుల్లా అడ్డుకుంటున్న వైసీపీ: కళా

రైతుల యాత్రను రాక్షసుల్లా అడ్డుకుంటున్న వైసీపీ: కళా

యజ్ఞంలా సాగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రను వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు. ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రను ప్రభుత్వం పోలీసులతో అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా రైతులకు ప్రజలు మద్దతు తెలుపుతుంటే, వైసీపీకి గుబులు పట్టుకుందన్నారు. అన్నం తినడానికి, తలదాచుకోవటానికి నీడ లేకుండా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తున్న వైసీపీ నేతల దుశ్చర్యలకు ప్రశ్చాత్తాపం చెందే రోజు వస్తుందని మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. 

Updated Date - 2021-12-08T08:03:16+05:30 IST