అధికారం ఉందని బరితెగిస్తున్నారు: యరపతినేని
ABN , First Publish Date - 2021-10-29T23:10:55+05:30 IST
అధికారం ఉందని వైసీపీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గురజాల , దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలకు అధికార పార్టీ భయపడుతుందన్నారు.

గుంటూరు: అధికారం ఉందని వైసీపీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. గురజాల , దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలకు అధికార పార్టీ భయపడుతుందన్నారు. వార్డు రిజర్వేషన్‌లు అస్దవ్యస్దంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ చేయాలనుకునే అభ్యర్థులపై బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. అభ్యర్దుల ఇళ్లకు పోలీసులు వెళ్లి గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ మాదిరిగా జగన్ పాలన ఉందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పతానావస్దకు చేరుకుందన్నారు.