కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా లేదు: యనమల

ABN , First Publish Date - 2021-02-01T19:44:52+05:30 IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.

కేంద్ర బడ్జెట్‌ ఆశాజనకంగా లేదు: యనమల

అమరావతి: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల కృష్ణుడు విమర్శించారు. ఏపీకి చెందిన ప్రధాన సమస్యలు, సవాళ్లకు పరిష్కారం చూపలేదన్నారు. బడ్జెట్‌లో అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావనే లేదని విమర్శించారు. బడ్జెట్‌లో ఏపీని విస్మరించడం బాధాకరమన్నారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాలను విస్మరించిందన్నారు. బడ్జెట్‌లో ఏపీని విస్మరించే పరిస్థితి రావడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ వారి కేసులు గురించే మాట్లాడారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామంటూ ఓట్లేయించుకున్న వైసీపీ.. తర్వాత వదిలేసిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Updated Date - 2021-02-01T19:44:52+05:30 IST