ధ్రువపత్రాలుంటేనే తిరుమలకు అనుమతి

ABN , First Publish Date - 2021-12-25T08:33:55+05:30 IST

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌, లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నెగటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.

ధ్రువపత్రాలుంటేనే తిరుమలకు అనుమతి

వ్యాక్సినేషన్‌ లేదా కరోనా నెగటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి 

తిరుమల, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌, లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నెగటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది. ఒవైుక్రాన్‌  దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటీవల కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని, ఈ క్రమంలో కచ్చితంగా సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉన్నవారికి మాత్రమే అలిపిరి చెక్‌పాయింట్‌ నుంచి తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

Updated Date - 2021-12-25T08:33:55+05:30 IST