నాటుసారాను నియంత్రించండి

ABN , First Publish Date - 2021-10-19T08:10:47+05:30 IST

‘‘మండలంలో నాటుసారాను ఇళ్లల్లో, బడ్డీ బంకుల్లో పెట్టి కొందరు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మీరిచ్చే డబ్బులన్నీ నాటుసారాకే వెళ్తున్నాయి.

నాటుసారాను నియంత్రించండి

‘ఆసరా’ పంపిణీలో ఎంపీ, ఎమ్మెల్యేకు మహిళల వినతి


బొల్లాపల్లి, అక్టోబరు 18: ‘‘మండలంలో నాటుసారాను ఇళ్లల్లో, బడ్డీ బంకుల్లో పెట్టి కొందరు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మీరిచ్చే డబ్బులన్నీ నాటుసారాకే వెళ్తున్నాయి. ముందు గ్రామాల్లో సారా విక్రయాలను నియంత్రించండి’’ అంటూ మహిళలు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు మొరపెట్టుకున్నారు. గుంటూరు జిల్లా బొల్లాపల్లిలో సోమవారం ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈసందర్భంగా చక్రాయపాలెం మహిళలు ఎంపీ వద్దకు వచ్చి ‘‘మా భర్తలు డిగ్రీలు, పీజీలు చేసి సారాకు బానిలయ్యారు. చిత్రహింసలు పెడుతున్నారు. తక్షణమే సారా కట్టడికి చర్యలు తీసుకోండి’’ అని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన ప్రజాప్రతినిధులు సారా విక్రయాలపై అధికారులతో మాట్లాడి ఉక్కుపాదం మోపుతామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-19T08:10:47+05:30 IST