సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆ ఒక్క మాట అనడంతో మహిళ ఆత్మహత్య..

ABN , First Publish Date - 2021-12-26T18:57:16+05:30 IST

ఇటీవల వీరి మధ్య గొడవలు జగరడంతో మురళీకి దూరంగా ఉంటోంది...

సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆ ఒక్క మాట అనడంతో మహిళ ఆత్మహత్య..

చిత్తూరు జిల్లా/బంగారుపాళ్యం : మండలంలోని మడుపోలూరు గ్రామానికి చెందిన తులసమ్మ(51) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్‌ఐ మల్లికార్జున్‌రెడ్డి కథనం మేరకు... తులసమ్మ భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. గత కొన్నేళ్లుగా తులసమ్మ అదే గ్రామానికి చెందిన మురళి(44)తో సహజీవనం చేస్తోంది. ఇటీవల వీరి మధ్య గొడవలు జగరడంతో మురళీకి దూరంగా ఉంటోంది. శుక్రవారం మరోమారు ఆమెతో గొడవపడిన మురళి ఉంటే తనతో ఉండాలని లేకుంటే చనిపోవాలని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలోని మామిడి చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో తులసమ్మ మృతదేహన్ని శనివారం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడు సునీల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-12-26T18:57:16+05:30 IST