మహిళలకు క్షమాపణ చెప్పాలి: సీపీఐ రామకృష్ణ
ABN , First Publish Date - 2021-12-30T08:11:44+05:30 IST
బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.50కే అందిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనతో బీజేపీ నేతలే సిగ్గుపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

- ‘చీప్’ వ్యాఖ్యలపై సోము వీర్రాజు వివరణ
- తమ్మినేని, బొత్స, కొడాలి, పేర్ని, పయ్యావులకు కౌంటర్
బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.50కే అందిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటనతో బీజేపీ నేతలే సిగ్గుపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏపీ మహిళలు మద్య నిషేధం కోరుతుంటే.. వీర్రాజు చీప్ లిక్కర్ పారించడం గురించి వ్యాఖ్యలు చేయడం సరికాదని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని బుధవారం ఆయన డిమాండ్ చేశారు. వీర్రాజుకు నిజంగా పిచ్చి పరాకాష్టకు చేరిందని అన్నారు. బీజేపీపై పార్టీ పరంగా విమర్శలు చేసామేగానీ, ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు వెళ్లలేదన్నారు. కానీ.. వీర్రాజు మాత్రం సీపీఐపైన, తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణపైన దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీర్రాజు చేసిన ఆరోపణలు అవాస్తవాలని తేలితే ముక్కును నేలకు రాయగలరా? అన్నారు.