ఎన్‌డీఆర్ఎఫ్ కానిస్టేబుల్‌పై మోసం చేశాడని మహిళ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-12-09T17:28:38+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పీఎస్‌లో జీరో యఫ్ఐఆర్ కేసు నమోదైంది. పందలపర్రు గ్రామానికి చెందిన ఎన్‌డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కొట్టాల నరేష్ బాబుపై

ఎన్‌డీఆర్ఎఫ్ కానిస్టేబుల్‌పై మోసం చేశాడని మహిళ ఫిర్యాదు

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం పీఎస్‌లో జీరో యఫ్ఐఆర్ కేసు నమోదైంది. పందలపర్రు గ్రామానికి చెందిన ఎన్‌డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ కొట్టాల నరేష్ బాబుపై మహిళ ఫిర్యాదు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నరేష్ బాబుకు నిన్న వివాహం జరగడంతో... విషయం తెలిసి మహిళ ఫిర్యాదు చేసింది. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ స్వస్థలం కావడంతో కేసును పోలీసులు నరసాపురం పీఎస్‌కు బదిలీ చేశారు. 

Updated Date - 2021-12-09T17:28:38+05:30 IST