టీడీపీ మేనిఫెస్టో ఉపసంహరణ
ABN , First Publish Date - 2021-02-06T09:20:19+05:30 IST
గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం విడుదల చేసిన మేనిఫెస్టోను ఉపసంహరించుకొంటున్నట్లు టీడీపీ ప్రకటించింది.

ఎస్‌ఈసీ ఆదేశాలు గౌరవిస్తున్నాం: ధూళిపాళ్ల
అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం విడుదల చేసిన మేనిఫెస్టోను ఉపసంహరించుకొంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. ఎ్‌సఈసీ ఆదేశాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం తెలిపారు. గ్రామాల అభివృద్ధికి పంచ సూత్రాల పేరుతో తాము ఎన్నికల ప్రణాళిక విడుదల చేస్తే దానిపై వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ప్రశ్నించారు.