చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా దాడులేంటి?

ABN , First Publish Date - 2021-10-21T10:06:51+05:30 IST

ముఖ్యమంత్రిని దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఈ దాడుల సంస్కృతేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఒంగోలులో ప్రశ్నించారు.

చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా దాడులేంటి?

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శ

ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 20: ముఖ్యమంత్రిని దూషించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఈ దాడుల సంస్కృతేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఒంగోలులో ప్రశ్నించారు. రాష్ట్రంలో వేరే సమస్యలు లేనట్లు అధికార, ప్రతిపక్షాలు బూతులు, దాడులతో గడుపుతున్నాయన్నారు. మార్కాపురంలో ఇండస్ట్రీయ ల్‌ పార్కు ఏమైందో, పామూరు దగ్గర నిమ్జ్‌ సంగతేమిటో చెప్పాలని నిలదీశారు.

Updated Date - 2021-10-21T10:06:51+05:30 IST