మూడు రోజుల పాటు ఏపీలో...
ABN , First Publish Date - 2021-03-24T23:09:04+05:30 IST
మూడు రోజుల పాటు ఏపీలో...

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులను వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ప్రధానంగా ఈ రోజు, గురువారం, శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ గురువారం, శుక్రవారం కూడా ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.