వక్ఫ్‌బోర్డ్‌ సీఈవోకు జైలు, జరిమానా

ABN , First Publish Date - 2021-11-09T07:24:36+05:30 IST

వక్ఫ్‌బోర్డ్‌ సీఈవోకు జైలు, జరిమానా

వక్ఫ్‌బోర్డ్‌ సీఈవోకు జైలు, జరిమానా

అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ స్టేట్‌ వక్ఫ్‌బోర్డ్‌ సీఈవో ఎస్‌.అలీమ్‌ భాషాకు హైకోర్టు రెండు వారాల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం తీర్పు ఇచ్చారు. అప్పీల్‌ దాఖలు చేసుకునేందుకు శిక్ష అమలును 2 వారాలు నిలుపుదల చేశారు. కర్నూలు జిల్లా, ఆలూరు మండలం మొలగవల్లి పరిధిలోని సర్వే నం.662లో 18.79 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ నిషిద్ధ జాబితా 22(ఏ)(1)(సి)లో చేర్చడాన్ని సవాల్‌ చేస్తూ బి.శివానంద హైకోర్టును ఆశ్రయించారు. ఆ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లో సంబంధిత సర్వే నంబరును రిజిస్ట్రేషన్‌ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 31 డిసెంబరు 2019న వక్ఫ్‌బోర్డ్‌ సీఈవోను ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.


Updated Date - 2021-11-09T07:24:36+05:30 IST