వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలి

ABN , First Publish Date - 2021-02-01T08:11:51+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను టీడీపీ కోరింది.

వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలి

ఎస్‌ఈసీకి అశోక్‌బాబు లేఖ

అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి) : గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను టీడీపీ కోరింది. పంచాయతీ ఎన్నికల్లో విధులు దుర్వినియోగం చేయకుండా వలంటీర్లను నియంత్రించాలని టీడీపీ ఎమ్మెల్సీ పీ అశోక్‌బాబు ఎస్‌ఈసీకి ఆదివారం లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మద్యం దుకాణాలను మూసేయాలని ఆయన మరో లేఖ రాశారు. చిత్తూరు జిల్లా బీరనకుప్పం గ్రామంలో సర్పంచి అభ్యర్థి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బోరు వెల్స్‌ వేయడాన్ని టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాది లక్ష్మీనారాయణ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-02-01T08:11:51+05:30 IST