వివేకా కేసులో వేగం పెంచిన సీబీఐ

ABN , First Publish Date - 2021-08-25T09:12:14+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు పులివెందుల పట్టణంలోని దుకాణాల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

వివేకా కేసులో వేగం పెంచిన సీబీఐ

పులివెందుల్లో సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన 


పులివెందుల, ఆగస్టు 24: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు పులివెందుల పట్టణంలోని దుకాణాల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రధాన రహదారిలోని పూలంగళ్ల వీధిలో పలు దుకాణాల వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను మంగళవారం సాయంత్రం పరిశీలించారు. వివేకా హత్య కేసులో వేగం పెంచిన సీబీఐ అధికారులు కీలక ఆధారాల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వచ్చిన అధికారులు సీసీ టీవీ ఫుటేజీల పరిశీలన ప్రారంభించారు. 


ఒకరిని విచారించిన అధికారులు

కడప కేంద్రకారాగారం అతిథి గృహంలో పులివెందుల ప్రాంతానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డిని ఏడు గంటలపాటు సీబీఐ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఈయన్ను గతంలో కూడా పలుమార్లు అధికారులు విచారించారు.

Updated Date - 2021-08-25T09:12:14+05:30 IST