విజయసాయి వ్యాఖ్యలను ఖండించిన విష్ణువర్థన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-02-09T00:52:48+05:30 IST

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి ఖండించారు.

విజయసాయి వ్యాఖ్యలను ఖండించిన  విష్ణువర్థన్‌రెడ్డి

అమరావతి: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రెండో అత్యున్నతస్థాయి పదవికి అవమానం చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. వైసీపీ నేతలు రాజ్యాంగాన్ని, అందులో ఉన్న వ్యక్తులను అవమానించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే  విజయసాయిరెడ్డి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని దేశ ప్రజలకు, వెంకయ్యనాయుడికి వైసీపీ క్షమాపణ చెప్పాలని విష్ణువర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-02-09T00:52:48+05:30 IST