సీఎండీని కలిసిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు
ABN , First Publish Date - 2021-03-17T20:45:40+05:30 IST
సీఎండీని కలిసిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు
విశాఖ: సీఎండీని కలవడానికి 2 గంటల సమయం పట్టిందని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని స్టీల్ ప్లాంట్ సీఎండీని కోరామన్నారు. ఆర్ కార్డ్ ఉన్నవారు 8500 మందికి శాశ్వత పరిష్కారం చూపాలని సీఎండీకి 4 పేజీల వినతిపత్రాన్ని అందజేసినట్లు వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్తామని సీఎండీ హామీ ఇచ్చారని చెప్పారు. తమ సమస్యల పట్ల సీఎండీ సానుకులంగా స్పందించారని స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు పేర్కొన్నారు.