మదనపల్లె తరహాలో విశాఖలో మరో ఘటన!

ABN , First Publish Date - 2021-02-02T00:46:10+05:30 IST

నగరంలో మదనపల్లె తరహాలో పూజలు కలకలం రేపాయి. గాజువాక సమీపంలోని అజీమాబాద్‌లో అర్ధరాత్రి పూజలు

మదనపల్లె తరహాలో విశాఖలో మరో ఘటన!

విశాఖ: నగరంలో మదనపల్లె తరహాలో పూజలు కలకలం రేపాయి. గాజువాక సమీపంలోని అజీమాబాద్‌లో అర్ధరాత్రి పూజలు జనాలను బెంబేలెత్తించాయి. ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించారంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రాత్రంతా బయటే పడిగాపులు కాశారు. బాధితుల మానసిక స్థితి బాగోలేదని బంధువులు వెల్లడించారు. ఎట్టకేలకు పోలీసుల చొరవతో బాధితులను బంధువులు రక్షించారు. క్షేమంగా బయటపడడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. దృశ్యాలను చిత్రీకరించేందుకు మాత్రం బంధువులు అంగీకరించలేదు. 


ఇటీవల మదనపల్లెలో పూజుల పేరిట ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులే హతమార్చారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా విశాఖలో కూడా ఇలాంటి పూజలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందారు. మరోవైపు ఈ ఘటన మదనపల్లె తరహా ఘటన కాదంటూ పోలీసులు తోసిపుచ్చుతున్నారు. బాధితుల మానసిక స్థితి బాగోలేకనే పిచ్చిగా ప్రవర్తించారని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2021-02-02T00:46:10+05:30 IST