ఆకలితో అలమటిస్తున్న 4 వేల మంది విద్యార్థులు
ABN , First Publish Date - 2021-02-27T03:42:06+05:30 IST
ఆకలితో అలమటిస్తున్న 4 వేల మంది విద్యార్థులు

విశాఖపట్నం: ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగం దగ్గర విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ కోసం వచ్చి చీకట్లో విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. భోజనం వసతి లేకపోవడంతో 4 వేల మంది విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి విద్యార్థులు కౌన్సిలింగ్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
పసి పిల్లలను తీసుకుని పలువురు విద్యార్థునులు కౌన్సిలింగ్కు వచ్చారు. ఇప్పటి వరకు సుమారు 500 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి తాగునీరు కూడా అందించని అధికారులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలింగ్ చేసేవారు ముగ్గురే ఉన్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.