‘స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే బీజేపీ పతనం ప్రారంభమైనట్టే’

ABN , First Publish Date - 2021-02-05T21:15:18+05:30 IST

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

‘స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే బీజేపీ పతనం ప్రారంభమైనట్టే’

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరితో కలిసి పోరాటం చేస్తామని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే బీజేపీ పతనం ప్రారంభమైనట్టేనని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా ఉద్యమం చేస్తామన్నారు. ఆనాడు 32 మంది బలిదానంతో విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు.  ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే పోరాట పటిమతోనే సాధించుకున్నామన్నారు. వేలాది కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పును సరిదిద్దుకొని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-02-05T21:15:18+05:30 IST