కూర్మన్నపాలెం దగ్గర హైవే దిగ్బంధం.. భారీగా ట్రాఫిక్ జామ్

ABN , First Publish Date - 2021-02-26T18:03:35+05:30 IST

కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రిలే నిరాహారదీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరం దగ్గర హైవేను దిగ్బంధం చేశారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు...

కూర్మన్నపాలెం దగ్గర హైవే దిగ్బంధం.. భారీగా ట్రాఫిక్ జామ్

విశాఖ: కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రిలే నిరాహారదీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరం దగ్గర హైవేను దిగ్బంధం చేశారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. రాస్తారోకోతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Updated Date - 2021-02-26T18:03:35+05:30 IST