11 గంటల వరకు అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలి: ఎస్పీ సిద్ధార్థ్

ABN , First Publish Date - 2021-12-31T16:18:56+05:30 IST

ఒమైక్రాన్‌ విజృంభిస్తున్న తరుణంలో కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలతో కూడిన ఆంక్షలు విధించామని ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ తెలిపారు.

11 గంటల వరకు అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలి: ఎస్పీ సిద్ధార్థ్

విజయవాడ: ఒమైక్రాన్‌ విజృంభిస్తున్న తరుణంలో కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలతో కూడిన ఆంక్షలు విధించామని ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ తెలిపారు. రాత్రి 11గంటల కల్ల అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని అన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు పూర్తిగా నిషిద్ధం విధించినట్లు చెప్పారు. మరోవైపు పోలీసులు చేపట్టిన  చర్యలు కారణంగానే మహిళలు ఫిర్యాదులు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. అందువల్లే మహిళాల కేసులు ఎక్కువ నమోదయ్యాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకోవడం వల్లే మధ్యం, గంజాయి, ఇసుకపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాబోయే రోజుల్లో మహిళల రక్షణ, భద్రతకే తమ ప్రధమ ప్రాధాన్యత అని సిద్ధార్థ్ కౌశిల్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-31T16:18:56+05:30 IST